- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ స్టీల్ సిటీ నుంచి గ్లోబల్ ఏఐ హబ్‌గా మారింది: మంత్రి లోకేష్
విశాఖలో గూగుల్ ఏఐ హబ్ భూమి పూజ! "నమో అంటే నాయుడు - మోడీ" అని మంత్రి లోకేష్ వ్యాఖ్య. స్టీల్ సిటీ నుండి ఏఐ హబ్‌గా విశాఖ ప్రస్థానం మొదలైందని వెల్లడి.

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం తర్లువాడలో 'గూగుల్ ఏఐ డేటా హబ్' (Google AI Data Hub) నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో పాటు గూగుల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ఐటీ ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు.
" నిన్నటి వరకు 'ఉక్కు నగరం'గా ఉన్న విశాఖ, నేటి నుంచి ప్రపంచ స్థాయి 'ఏఐ హబ్'గా అవతరించబోతోందని ఆయన ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రభుత్వ విజనరీ లీడర్‌షిప్ గురించి వివరించి గూగుల్ వంటి దిగ్గజ సంస్థలను ఒప్పించగలిగామని తెలిపారు. ఈ సందర్భంగా 'నమో' (NaMo) అంటే నాయుడు- మోడీ అని, వీరిద్దరి సమన్వయంతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర అభివృద్ధిపై తమ విధానాన్ని స్పష్టం చేస్తూ, "ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని" (అమరావతి) అనేది తమ నినాదమని, అయితే అభివృద్ధిని మాత్రం అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. ఐటీ, ఏఐ రంగాలకు విశాఖను కేంద్రంగా మార్చడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడమే లక్ష్యమని, గూగుల్ ఏఐ హబ్ వంటి ప్రాజెక్టులు అందులో కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.






