- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్టుకొమ్మలను తొలగించిన గ్రామ కమిటీ నాయకులు
ధర్పల్లి గ్రామ చెరువు నిండేందుకు ప్రధాన వనరుగా ఉన్న మాటు కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెట్టుకొమ్మలు, వ్యర్థపు మొక్కలను గ్రామ కమిటీ నాయకులు తొలగించారు.

దిశ, ధర్పల్లి : ధర్పల్లి గ్రామ చెరువు నిండేందుకు ప్రధాన వనరుగా ఉన్న మాటు కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెట్టుకొమ్మలు, వ్యర్థపు మొక్కలను గ్రామ కమిటీ నాయకులు తొలగించారు. ధర్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆర్మూర్ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ నాయకులు కల్వర్టు కింద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెట్టుకొమ్మలు, వ్యర్థపు మొక్కలు తదితరాలను తొలగించి, నీరు సక్రమంగా చెరువులోకి చేరేలా చర్యలు చేపట్టారు. గత వేసవిలో మాటు కాలువలో అక్కడక్కడా పడిపోయిన చెట్లు, పిచ్చి మొక్కలు, బండరాళ్లను పూర్తిగా తొలగించి, స్వల్ప వర్షాలు కురిసినా నీరు చెరువులోకి చేరే విధంగా పనులు నిర్వహించారు. కొన్ని చోట్ల నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పనికిరాని చెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు. ఇటీవల ఏర్పాటైన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మాటు కాలువకు చిన్నచిన్న మరమ్మత్తులు కూడా చేపట్టారు. కాలువలో ఎక్కడా నీరు వృథాగా పోకుండా, పూర్తిగా చెరువులోకి చేరేలా అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.






