తుమ్మిడిహెట్టికు బండి సంజయ్ అనుకూలమా? వ్యతిరేకమా? : ప్రభుత్వ వీప్, వేముల వీరేశం

by Muthe.Rajitha |

కేంద్రమత్రి బండి సంజయ్ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు అనుకూలమా? వ్యతిరేకమా? చేప్పాలని ప్రభుత్వ విప్, వేముల వీరేశం డిమాండ్ చేశారు.

తుమ్మిడిహెట్టికు బండి సంజయ్ అనుకూలమా? వ్యతిరేకమా? : ప్రభుత్వ వీప్, వేముల వీరేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రమత్రి బండి సంజయ్ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ద్వారా అదిలాబాద్ జిల్లా ప్రాంత రైతాంగానికి నీళ్లు రావటానికి మీరు అనుకూలమా? వ్యతిరేకమా చేప్పాలి? అనుకూలమే ఐతే మహారాష్ట్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య మద్యవర్తిత్వం వహించి చర్చలు జరిగేలా చూడాలని ప్రభుత్వ విప్, వేముల వీరేశం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు, ప్రయోజనాల పట్ల బాధ్యత లేని పార్టీ బీజేపీనే అని, తెలంగాణలో ఓట్లు, సీట్లు కావాలి గానీ ప్రయోజనాలు పట్టదని మండిపడ్డారు. సీఎంకు చేతగాదు అని సంజయ్ అంటున్నారని, రేవంత్ రెడ్డి సమర్థుడు కాబట్టే ధాన్యం కొంటున్నారని, బీజేపీనీ గద్దె దింపి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తాఅని చెప్తున్నారని వేముల వీరేశం అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ది జుగల్బంది సంబంధమని, రాష్ట్ర ప్రభుత్వమే సీబీఐకి ఇచ్చింది కానీ దాని మీద ఎలాంటి పురోగతి లేదన్నారు. బీజేపీకి నరనరాన తెలంగాణ అభివృద్ది, సంక్షేమం పట్ల చిత్తశుద్ది లేదని, తెలంగాణ ఏర్పాటుపైనే ద్వేషమే ఉన్నట్లు కన్పిస్తుందని వేముల వీరేశం ఆరోపించారు.

బీజేపీ కాకినాడ తీర్మాణం అమలు చేసి ఉంటే అనాడే రాష్ట్రం ఏర్పడేదని, పార్టీకి నష్టం జరిగినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన చెప్పారు. కేసీఆర్ కు తెలంగాణ అమర వీరుల పట్ల గౌరవం ఉండి ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సం నాడు అమరవీరుల స్థూపానికి నివాళులు ఆర్పించేవారని వేముల వీరేశం అన్నారు. కేసీఆర్ కు తెలంగాణ అనేది రాజకీయ ప్రయోజనమే తప్ప ఇంకో కోణం నుంచి చూడలేదని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ జాగీరు ఎక్కడున్నాయో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుదని, బాధ్యత కలిగిన డీప్యూటీ సీఎం స్థాయిలో ఉండి అలా మాట్లాడటం సరికాదని వేముల వీరేశం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బీఆర్ఎస్ అనడం తెలంగాణకు పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడమేనని ఆయన మండిపడ్డారు.

Next Story