UPBudget: రికార్డు స్థాయిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్

by Malleboina Mahesh |

భారత దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ జనాభా లో అతి పెద్దగా ఉంటుంది. ముఖ్యంగా దేశంలోని 20 శాతంకు పైగా జనాభా కేవలం ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది.

UPBudget: రికార్డు స్థాయిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) జనాభా లో అతి పెద్దగా ఉంటుంది. ముఖ్యంగా దేశంలోని 20 శాతంకు పైగా జనాభా కేవలం ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థలో సైతం యూపీకి కీలక పాత్ర ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. దాదాపు 80 పార్లమెంట్, 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్ర బడ్జెట్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం.. యూపీ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా రాష్ట్ర శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ (Budget)ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధిని సాధించిందని కొనియాడారు. ముఖ్యంగా శాంతిభద్రతల బలోపేతం, మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర ఆర్థిక ప్రగతిని వివరిస్తూ.. 2024-2025 సంవత్సరానికి గానూ ఉత్తరప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) సుమారు రూ. 30.25 లక్షల కోట్లుగా అంచనా వేయబడిందని మంత్రి ప్రకటించారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 13.4 శాతం పెరుగుదలను సూచిస్తుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన తో పాటు రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి కల్పన, మహిళా సాధికారతకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేసినట్లు ఆయన పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఎక్స్‌ప్రెస్‌వేలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు నిధుల కేటాయింపులు జరిగాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషించబోతోందని సురేష్ ఖన్నా తన ప్రసంగంలో వెల్లడించారు. కాగా యూపీ బడ్జెట్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.

Next Story