H-1B వీసాపై అమెరికా కీలక ప్రకటన

by Muthe.Rajitha |   (  Updated:2026-02-11 12:08:59  IST  )

2026లో జరిగే H-1B వీసా లాటరీకి సంబంధించి అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ వీసా కోసం దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 4 నుంచి ప్రారంభించనున్నటు పేర్కొంది.

H-1B వీసాపై అమెరికా కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : 2026లో జరిగే H-1B వీసా లాటరీకి సంబంధించి అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ వీసా కోసం దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 4 నుంచి ప్రారంభించనున్నటు పేర్కొంది. ఈ ప్రక్రియ మార్చి 20 వరకు కొనసాగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత లాటరీ ఫలితాలు మార్చి చివరి లేదా ఏప్రిల్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ లాటరీ ద్వారా ఎంపికైనవారు FY 2027 వీసా కింద అక్టోబర్ 1 నుంచి అమెరికాలో పని చేయవచ్చు.

అయితే ఏడాది H-1B వీసా లాటరీ విధానంలో ఒక ముఖ్యమైన మార్పు చేశారు. ఒకే వ్యక్తికి ఒకే యజమాని ద్వారా ఒక్క రిజిస్ట్రేషన్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒకే యజమాని ఒక ఉద్యోగి పేరుతో అనేక రిజిస్ట్రేషన్లు చేస్తే అవన్నీ రద్దు చేస్తారు. కాగా మొత్తం H-1B వీసాలు 85,000 మాత్రమే ఉండగా... ఇందులో 65,000 వీసాలు సాధారణ కేటగిరీకి, మరో 20,000 వీసాలు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి కేటాయించారు. ఈ వీసాకు అర్హులైనవారు బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. అలాగే అమెరికాలో స్పెషలైజ్డ్ జాబ్ ఆఫర్ ఉండాలి.

ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఉద్యోగి కాకుండా ఉద్యోగం ఇచ్చే కంపెనీ లేదా యజమాని చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 10 డాలర్లు మాత్రమే అయినా.. లాటరీలో సెలెక్ట్ అయితే వీసా ఫీజులు, ఇతర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం చాలా మంది భారతీయ ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ ఈ H-1B లాటరీ కోసం ఎదురుచూస్తున్నారు.

Next Story