కేన్స్‌లో ఊర్వశీ రౌతేలా స్టన్నింగ్ లుక్.. డ్రెస్ కాస్ట్ రూ. రూ.1,491 కోట్లు

by Muthe.Rajitha |   (  Updated:2026-05-13 13:42:32  IST  )

బాలీవుడ్ నటి, గ్లోబల్ ఐకాన్ ఊర్వశీ రౌతేలా, 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

కేన్స్‌లో ఊర్వశీ రౌతేలా స్టన్నింగ్ లుక్.. డ్రెస్ కాస్ట్ రూ. రూ.1,491 కోట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటి, గ్లోబల్ ఐకాన్ ఊర్వశీ రౌతేలా, 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ డిజైనర్ మైఖేల్ సింకో రూపొందించిన గౌన్ ధరించి ఊర్వశీ రెడ్ కార్పెట్‌పై మెరిసింది. ఈ గౌన్ విలువే రూ. 40 కోట్లు ఉండగా, ఆమె ధరించిన మొత్తం లుక్ విలువ దాదాపు రూ. 1,491 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లుక్‌లో అత్యంత ఖరీదైన భాగం ఆమె ధరించిన ఆభరణాలే కావడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వజ్రాలుగా పేరొందిన మౌసైఫ్ రెడ్ (Moussaieff Red), ఒప్పెన్‌హైమర్ బ్లూ (Oppenheimer Blue) వంటి డైమండ్స్ ఆ గౌనుపై పొందుపరిచారు. వీటి విలువ దాదాపు రూ.151 మిలియన్లు. దీనికి అదనంగా రూ.6 లక్షల విలువైన జుడిత్ లీబర్ స్కార్లెట్ ప్యారట్ క్లచ్‌ను కూడా ఆమె ధరించి స్టన్నింగ్ లుక్ లో అదరగొట్టింది ఊర్వశీ.

కేన్స్ చరిత్రలోనే కాకుండా, మెట్ గాలా వంటి గ్లోబల్ ఈవెంట్లలో కూడా ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ ఇంతటి కాస్ట్లీ అవుట్ ఫిట్ ప్రదర్శించలేదు. గతంలో హాలీవుడ్ స్టార్ కిమ్ కర్దాషియాన్ సృష్టించిన రికార్డులను సైతం ఊర్వశీ అధిగమించినట్లు నివేదికలు చెబుతున్నాయి. భారతీయ వారసత్వాన్ని అంతర్జాతీయ ఫ్యాషన్‌తో మిళితం చేస్తూ ఆమె ప్రదర్శించిన ఈ 'మాస్టర్‌పీస్' సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది, భారత్ పేరును అంతర్జాతీయ వేదికపై మరోసారి మారుమోగించింది.

Next Story