- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఉద్యోగులకు యూపీ సర్కారు షాక్
ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఆస్తుల వివరాలు వెల్లడించని 68 వేల సర్కారు ఉద్యోగుల వేతనాలు ఆపివేసింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అయితే యూపీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగులంతా తమ స్థిర, చర ఆస్తుల వివరాలను తప్పకుండా మానవ సంపద పోర్టల్ పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు జనవరి 31 చివరి తేదీగా ప్రకటిస్తూ.. వివరాలు తెలుపని ఉద్యోగుల జీతాలు ఆపివేస్తామని కూడా హెచ్చరించింది. దాదాపు ఉద్యోగులంతా తమ ఆస్తుల వివరాలు సమర్పించగా.. వివరాలు ఇవ్వని 68 వేల మంది ఉద్యోగుల శాలరీలపై వేటు పడింది.
వీరిలో 34,926 మంది గ్రూప్-C ఉద్యోగులు అత్యధికంగా ఉండగా.. 22,624 మంది గ్రూప్-D ఉద్యోగులు ఉన్నార. అలాగే 7,204 మంది గ్రూప్-B, 2,628 మంది గ్రూప్-A ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ జనవరికి సంబంధించిన వేతనాలు ఫిబ్రవరి ఒకటో తేదీన వారి అక్కౌంట్లలో జమ కాలేదు. అయితే వీరికి మరో అవకాశం ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం ఇంకా తేల్చలేదు.






