- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకనుంచి 2 గంటల్లో హైదరాబాద్ నుంచి బెంగళూర్‌కు: అశ్వినీ వైష్ణవ్
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ మూడు హైస్పీడ్ కారిడార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ మూడు హైస్పీడ్ కారిడార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సహా ఏడు నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం ముంబయి-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు కారిడార్, అనేక రాష్ట్రాలు, జిల్లాలను కలిపే తూర్పు, పశ్చిమ రవాణా కారిడార్ల పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. తాజాగా ఈ కారిడార్లపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. ఇక నుంచి హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణాలు సులభంగా ఉంటాయని అన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చని చెప్పారు. హైస్పీడ్ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని తెలిపారు. హైస్పీడ్ కారిడార్ పూర్తయ్యాక హైదరాబాద్ నుంచి చెన్నైకి 2.55 గంటల్లో చేరుకోవచ్చని అన్నారు. దీని వల్ల తెలంగాణ, ఏపీ, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్, టూరిజం రంగాలు కూడా హైస్పీడ్‌లో అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఈ హైస్పీడ్ రైళ్లు తెలంగాణ, ఏపీకి గేమ్ చేంజర్ మారుతాయని వెల్లడించారు. బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే రంగానికి రూ.5,454 కోట్లు కేటాయించినట్టు గుర్తుచేశారు.






