ఇకపై ఇంటర్ విద్యార్థులకూ యూనిఫామ్స్

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు సహాయం అందించేలా కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఇంటర్ విద్యార్థులకూ యూనిఫామ్స్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల చదువుకు మరింత సహాయం అందించేలా కీలక నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులందరికీ ఉచితంగా యూనిఫామ్స్‌తో పాటు వెల్కమ్ కిట్స్ అందివ్వనుంది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్ అందిస్తారు. అబ్బాయిలకు షర్ట్, ప్యాంట్ ఇవ్వగా, అమ్మాయిలకు సల్వార్ కమీజ్ ఇస్తారు. అలాగే వెల్కమ్ కిట్‌లో బ్యాగ్, నోట్ బుక్స్, పెన్సిల్స్, పెన్, రూలర్, ఎరేజర్, షార్ప్‌నర్ వంటి చదువుకు అవసరమైన వస్తువులు ఉంటాయి. ఈ సౌకర్యం ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుంది.

అంతేకాదు ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విద్యార్థులకు కూడా ఈ ఉచిత యూనిఫామ్స్, కిట్స్ అందజేస్తారు. కాలేజీలు తెరుచుకున్న తర్వాత మొదటి నెలలోనే ఇవి పంపిణీ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇంటర్ విద్యార్థుల సంక్షేమ పథకం భాగంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గి, చదువుపై మరింత దృష్టి పెట్టేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే ఇకపై ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు తగ్గించే ప్లాన్ లో కూడా ఉందని సమాచారం.

Next Story