- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి లేక నిరుద్యోగి ఆత్మహత్య..
by Manoj |
దిశ,చిట్యాల : ఉపాధి లేక ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం..latest telugu news

X
దిశ,చిట్యాల : ఉపాధి లేక ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి చిట్యాల పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణ కేంద్రంలోని ఇందిరానగర్ కాలానికి చెందిన గోసుకొండ నవీన్(27) డిగ్రీ పూర్తి చేశాడు. గత కొంత కాలంగా ఇంటివద్దే ఖాళీగా ఉంటున్నాడు. సరైన ఉపాధి లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాసేపటికి మృతుని తల్లి చూసి లబోదిబోమని రోదించడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మృతదేహాన్ని కిందికి దింపారు. అప్పటికే నవీన్ మృతి చెందాడు. మృతుడికి ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.
Next Story






