ప్ర‌పంచంలో మొద‌టిసారి ఈ పేషెంట్ల‌తో వైద్య విద్యార్థుల‌కు శిక్ష‌ణ‌ (వీడియో)

by Disha Web Desk 20 |
ప్ర‌పంచంలో మొద‌టిసారి ఈ పేషెంట్ల‌తో వైద్య విద్యార్థుల‌కు శిక్ష‌ణ‌ (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః నానాటికీ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విజ్ఞానంతో ఎన్నో స‌మ‌స్య‌లు సులువుగా ప‌రిష్కార‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా వైద్య రంగంలో టెక్నాల‌జీ సేవ‌లు మెరుగైన ప్ర‌తిఫ‌లాలు ఇస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్ధులు కొత్తగా, భవిష్యత్తు కోసం నేర్చుకునే విధానానంలో కీల‌క అడుగు ముందుకేశారు. ఇలాంటి శిక్ష‌ణ‌ను అనుభవించడంలో వీళ్లు ప్రపంచంలోనే మొదటివారిగా గుర్తింపు పొందారు. ఇక్క‌డ వైద్య విద్యార్థులు రోగుల హోలోగ్రాఫిక్ నమూనాల సహాయంతో ప్రాక్టిక‌ల్స్ నేర్చుకుంటున్నారని విశ్వవిద్యాలయం తాజాగా తెలియజేసింది. ప్రపంచ నలుమూలల నుండి దీన్ని ట్యూన్ చేయడం ద్వారా అనారోగ్యాలకు చికిత్స చేయడానికి ఈ శిక్షణ అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు.

ఇందులో భాగాంగా, అడెన్‌బ్రూక్స్ హాస్పిటల్‌లోని విద్యార్థులు కొత్త మిక్స్-రియాలిటీ ట్రైనింగ్ సిస్టమ్ అయిన HoloScenarios ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికత ప్రపంచ స్థాయి బోధన, అభ్యాసాన్ని సుల‌భ‌త‌రం చేయ‌నుంది. అలాగే, లైఫ్ లాంటి హోలోగ్రాఫిక్ పేషెంట్ ట్రైనింగ్ సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడి నుండైనా అందుబాటులో ఉంటుంది. ఇక‌, ఈ శిక్షణలో భాగంగా, మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్‌లను ధరిస్తార‌ని డెవలపర్లు తెలిపారు. నిజ జీవితంలో ఒకరినొకరు చూసుకోగలిగిన‌ట్లు ఇదీ ఉంటుంద‌ని అన్నారు. అంతేకాదు, వాళ్లు మ‌ల్టీ-లేయర్డ్, వైద్యపరంగా ఖచ్చితమైన హోలోగ్రాఫిక్ రోగితో కూడా సంభాషించగలరు. ప్ర‌స్తుతం ఉబ్బసం ఉన్న హోలోగ్రామ్ రోగితో వైద్య శిక్ష‌ణ జ‌రుగుతుండ‌గా, తర్వాత అనాఫిలాక్సిస్, పల్మనరీ ఎంబోలిజం, న్యుమోనియాలు ఈ మొదటి మాడ్యూల్‌లో భాగంగా ఉన్నాయి. కార్డియాలజీ, న్యూరాలజీలో మరిన్ని మాడ్యూల్స్ అభివృద్ధిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.


Next Story

Most Viewed