ఈవీఎం-వీవీప్యాట్లపై సుప్రీం తీర్పు.. ప్రధాని మోడీ ఏమన్నారంటే?

by Dishanational6 |
ఈవీఎం-వీవీప్యాట్లపై సుప్రీం తీర్పు.. ప్రధాని మోడీ ఏమన్నారంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈవీఎం-వీవీప్యాట్‌లపై సుప్రీంకోర్టు ప్రతిపక్షాలకు ఝలక్ అని అన్నారు ప్రధాని మోడీ. ఈవీఎంలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను క్రాస్ చెక్ చేయాలని పలువురు పిటిషన్లు దాఖలు చేయగా.. అన్ని వ్యాజ్యాలను కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఈ తీర్పుపై ప్రధాని మోడీ హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

బిహార్‌లోని ఆరారియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన మోడీ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగాన్ని ఆర్జేడీ, కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఇదో శుభదినమని.. ఈవీఎంలపై సందేహాలు లేవనెత్తే ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చిందని మండిపడ్డారు.

మరోవైపు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల, ఓబీసీ హక్కులను హరించడానిక కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని ఆరోపించారు మోడీ. భారతదేశంలో మతపరమైన రిజర్వేషన్లు ఉండవని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారని అన్నారు. అయితే, కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లను అమలు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిసోందన్నారు. దేశంలో కర్ణాటక మోడల్ రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చి కాంగ్రెస్ వారిని మోసం చేస్తుందని ధ్వజమెత్తారు మోడీ.



Next Story

Most Viewed