- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న ‘బుగ్గన’ నామినేషన్ వ్యవహారం.. ఈసీ షాక్ ఇవ్వబోతోందా?
గతంలో ఎన్నికల నామినేషన్ వ్యవహారం సాధారణంగా ఉండేది.

దిశ, వెబ్‌డెస్క్: గతంలో ఎన్నికల నామినేషన్ వ్యవహారం సాధారణంగా ఉండేది. అధికారులు, ప్రతపక్ష నాయకులు అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్‌ను అంతగా పట్టించుకునే వారు. కానీ, రానురాను రోజులు మారిపోయాయి. ప్రస్తుతం అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్‌పైనే అందరి ఫోకస్ ఉంటోంది. తాజాగా, ప్రస్తుత ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నామినేషన్ వ్యవహారంపై వివాదం నెలకొంది. డోన్‌లో ఆయన నామినేషన్ దాఖలు చేయగా ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తోంది. బుగ్గన దాఖలు చేసిన నామినేషన్‌లో మొత్తం ఆస్తుల వివరాలను చూపించలేదని ఆరోపించారు. ఇదే విషయాని వారు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై బుగ్గన రాజేంద్రనాథ్ సాయంత్రం 5 లోపు సమాధానం చెప్పాలని రిటర్నింగ్ అధికారి ఆదేశించారు. అయితే, ఆయన నామినేషన్‌ను అనుమతిస్తారా.. లేక తిరస్కరించి షాకిస్తారా అనేది ఆసక్తిగా మారింది.






