- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20 WC.. పాకిస్తాన్ తో రీప్లేస్మెంట్ కి ఉగాండా సిద్ధం
టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించి మరో వార్త తెర మీదికి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించి మరో వార్త తెర మీదికి వచ్చింది. భద్రతా సమస్యలు, రాజకీయ ఉద్రిక్తతలు కారణాలుగా చూపిస్తూ.. వరల్డ్ కప్ లో పాక్ జట్టు పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పాక్ జట్టు స్థానంలో ఉగాండా జట్టు రీప్లేస్‌మెంట్‌గా సిద్ధంగా ఉందని అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఐసీసీ అర్హత పొందిన జట్ల జాబితాలో ఉన్న ఉగాండా, అవసరం వస్తే వెంటనే టోర్నీలో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇటీవల జరిగిన ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి తొలిసారిగా టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన ఉగాండా జట్టు.. యంగ్ ప్లేయర్లు, వేగవంతమైన బౌలింగ్, అగ్రెసివ్ బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఏదైనా జట్టు చివరి నిమిషంలో తప్పుకుంటే, అర్హత జాబితాలో ఉన్న తదుపరి జట్టును తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఉగాండా పేరు ముందుకు రావడం విశేషంగా మారింది. అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ ఆడటం లేదని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐసీసీ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ పాల్గొనలేని పరిస్థితి వస్తే, ఉగాండా వరల్డ్ కప్‌లో అడుగుపెట్టడం ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద ఘట్టంగా నిలవనుంది. క్రికెట్ అభిమానులు ఈ పరిణామాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు పాక్ ఈ టోర్నమెంటు నుంచి తప్పుకుంటే తమకు స్థానం ఇవ్వాలని ఐస్ లాండ్ కూడా ఐసీసీని కోరింది.






