నందిగామలో రైలు ఢీకొని ఇద్దరు మృతి

by Muthe.Rajitha |

రంగారెడ్డి జిల్లా నందిగామ శివారులో తీవ్ర విషాద ఘటన నెలకొంది.

నందిగామలో రైలు ఢీకొని ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా నందిగామ శివారులో తీవ్ర విషాద ఘటన నెలకొంది. ఆదివారం జరిగిన ఒక ఘోర రైలు ప్రమాదంలో ఇద్దరు వలస కూలీల కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పాలుకావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బిహార్ రాష్ట్రానికి చెందిన ప్రీతి, చిన్ముల్‌కుమారి అనే ఇద్దరు అమ్మాయిలు నందిగామ పరిసర ప్రాంతాల్లో వంట కోసం కట్టెలు సేకరించడానికి సమీపంలోని ప్రాంతానికి వెళ్లారు.

కట్టెలు ఏరుకున్న అనంతరం వారు తిరిగి ఇంటికి వస్తూ, రైల్వే పట్టాలపై నడుచుకుంటూ ప్రయాణించారు. ఈ క్రమంలో అదే సమయంలో వేగంగా వచ్చిన హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలు వీరిని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ఇద్దరు అమ్మాయిలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. వంటచెరుకు కోసం వెళ్లిన ఆడపిల్లలు ఇలా శవాలై తిరిగిరావడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story