- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. KCR రిక్వెస్ట్ రిజెక్ట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు. రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్‌లోని నందినగర్‌లోని నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లోనే విచారించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించడంతో బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. దీనిపై ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో అని ఆసక్తి నెలకొంది. కాగా, నిన్న జారీ చేసిన నోటీసుల్లో 65 ఏళ్ల వయసు దృష్ట్యా పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదని సిట్ పేర్కొంది. విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతం వివరాలను తెలపాలని సూచించింది. అయితే.. కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌజ్‌లో విచారించాలని సిట్‌కు లేఖ రాశారు. ఆయన విజ్ఙప్తిని తిరస్కరించిన సిట్.. దీంతో నగర పరిధిలోనే విచారించాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే నందినగర్ నివాసాన్ని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇటీవలే మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ సంతోష్‌రావును సిట్ విచారించిన విషయం తెలిసిందే.






