- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియా గేట్‌పై ట్రంప్ ప్రశంసలు.. ఏంటీ అనూహ్య మార్పు!
గతకొంత కాలంగా భారత్‌పై సుంకాల మీద సుంకాలు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా వైఖరి మార్చారు.

దిశ, వెబ్‌డెస్క్: గతకొంత కాలంగా భారత్‌పై సుంకాల మీద సుంకాలు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా వైఖరి మార్చారు. సడన్‌గా భారత్‌పై ప్రేమలు ఒలకబోస్తున్నారు. భారత్‌లోని ఇండియా గేట్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అమెరికాలో అంతకంటే గొప్ప కట్టడం నిర్మిస్తున్నట్లు ట్రూత్‌లో పేర్కొన్నారు. అయితే.. భారత్‌తో మళ్లీ ట్రేడ్ డీల్ ఉంటుందని ట్రంప్ సంకేతాలు ఇస్తున్నాడని నిపుణులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలో ఇండియా గేట్ ఫొటోను పోస్టు చేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాగే భారత్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఇకపై వెనుజులా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని.. ఈ మేరకు డీల్ కుదిరిందని చెప్పారు. దీంతో భారత్ ఇకపై ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయదని చెప్పారు. అయితే ఈ విషయంపై భారత ప్రభుత్వం స్పందించకముందే ట్రంప్ ఈ ఊహాగానాలు వ్యక్తం చేశారు. కాగా, వెనుజులా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు ట్రంప్ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.






