- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
Vice President Elections: మద్దతు ఎవరికో తేల్చి చెప్పిన కేసీఆర్

దిశ, వెబ్‌డెస్క్: TRS to Support Margaret Alva in Vice President Elections| ఉపరాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థికే టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. విపక్షాల అభ్యర్థిగా బరిలో నిలిచిన మార్గరేట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు మొత్తం 16 మంది టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు విపక్షాల అభర్థి మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఇందుకు సంబంధించి ప్రకటనను శుక్రవారం విడుదల చేశారు. ఉప రాష్ట్రపతి పదవి కోసం ఆగస్టు 6న ఓటింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కించి ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కాగా గతనెలలో జరిగి రాష్ట్రపతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే మద్దతు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: టెన్షన్ పెట్టిస్తోన్న జగ్గారెడ్డి మౌనం.. సన్నిహితుల్లో ఆసక్తికర చర్చ
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.
- Tags
- Margaret Alva