NH 65పై విస్తరణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు.. AP నుంచి వచ్చే వాహనాల దారి మళ్లింపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-17 06:10:01  IST  )

సంక్రాంతి పండుగ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ప్రయాణికులకు పోలీసులు కీలక సూచనలు చేశారు.

NH 65పై విస్తరణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు.. AP నుంచి వచ్చే వాహనాల దారి మళ్లింపు
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ప్రయాణికులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. 65వ జాతీయ రహదారి (NH 65)పై విస్తరణ పనులు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు కొనసాగుతోన్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు నల్లగొండ జిల్లా పోలీసులు పలు చోట్ల వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. ముఖ్యంగా చిట్యాల, పెద్ద కాపర్తి, కొర్లపహాడ్, పంతంగి టోల్‌ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చిట్యాల, పెద్ద కాపర్తి సమీపంలో రహదారి పనులు జరుగుతుండటంతో అక్కడ వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందస్తు ఆంక్షలు విధించారు.

ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా..

గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చేవారు గుంటూరు వయా మాచర్ల - మిర్యాలగూడ - పెద్దవూర - హాలియా - చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు. ఇక నల్లగొండ నుంచి వచ్చేవారు నల్లగొండ వయా మర్రిగూడ బైపాస్ - మునుగోడు - చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ వెళ్లవచ్చు. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చే లారీలు, ఇతర భారీ వాహనాలను కోదాడ వద్ద దారి మళ్లించి, మాల్ మీదుగా హైదరాబాద్‌కు అనుమతిస్తున్నారు. ఒకవేళ NH 65పై ట్రాఫిక్ జామ్ తీవ్రంగా ఉంటే, చిట్యాల నుంచి భువనగిరి మీదుగా వాహనాలను హైదరాబాద్ వైపు మళ్లించేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.

డ్రోన్లతో నిత్యం నిఘా..

ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలు, సీసీ టీవీలను ఉపయోగిస్తున్నారు. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు హైవేపై అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Read More..

చలో హైదరాబాద్.. కిటకిటలాడుతున్న బస్టాండ్.. రైల్వే స్టేషన్లు

Next Story