- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారం జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్‌కు ఘోర ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్‌కు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌కు చెందిన సుమారు 20 మంది భక్తులు ట్రాక్టర్‌లో మంగళవారం ఉదయం జాతరకు బయలుదేరరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కేశవపూర్ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న మహాముత్తారం పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మేడారం జాతరకు ట్రాక్టర్లు, ట్రాలీల్లో అధిక సంఖ్యలో భక్తులు ప్రయాణిస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు. కాగా నేటి నుంచే సమ్మక్క సారక్క మహా జాతర మొదలవనుండగా.. లక్షలాది భక్తులు మేడారం చేరుకుంటున్నారు. నేడు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకోనుండగా.. వనదేవత సమ్మక్క రేపు గద్దెపైకి రానుంది.
READ MORE .....






