నీటి సంపులో పడి చిన్నారి మృతి

by Batti.Sumithra |

తిరుమలాపురం గ్రామానికి చెందిన కంచు బీరన్న–మౌనిక దంపతుల కుమార్తె అన్వి (2) నీటి సంపులో పడి మృతి చెందింది.

నీటి సంపులో పడి చిన్నారి మృతి
X

దిశ, చిట్యాల : మండలంలోని తిరుమలాపురం గ్రామానికి చెందిన కంచు బీరన్న–మౌనిక దంపతుల కుమార్తె అన్వి (2) నీటి సంపులో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అన్వి తోటి పిల్లలతో ఆడుకుంటుండగా నీటి సంపులో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో చిన్నారిని బయటికి తీసే ప్రయత్నం చేయగా, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Next Story