- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిసింది. ఇక తిరుగు ప్రయాణాలు మొదలవుతున్నాయి. ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందో చూసినట్లైతే.. చలి తీవ్రత కాస్త తగ్గింది. శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేఘాలు ఎక్కువగా ఉంటాయి. గాలి కదలిక అధికంగా ఉంటుంది. ఎక్కడా కూడా వానలు పడే చాన్స్‌లు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. క్రమంగా రాత్రివేళ ఏపీలో చలి పెరుగుతుందని తెలిపింది. అలాగే ఏపీలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. తెలంగాణలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.






