Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (30-12-2024)

by Kodari Anjali |   (  Updated:2024-12-30 09:50:14  IST  )

ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి. నేడు మీరు ఇష్టమైన వారితో ప్రశాంతంగా గడుపుతారు.

Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (30-12-2024)
X

మేష రాశి: ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి. నేడు మీరు ఇష్టమైన వారితో ప్రశాంతంగా గడుపుతారు. కానీ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఫ్రెండ్స్‌తో పిక్ నిక్ వెళ్తారు. సెమినార్లు ఇస్తారు. దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు. భాగస్వామితో చిన్న చిన్న గొడవలు అవుతాయి. పెద్దవారి సలహాలు తీసుకుంటారు. మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు. ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు.

వృషభ రాశి: శత్రువుల ప్రవర్తన మీకు చికాకు పుట్టిస్తుంది. కానీ ఉద్యోగస్థులకు నేడు కలిసి వస్తుంది. ప్రమోషన్లు అందుకుంటారు. నేడు ఈ రాశివారు అపరిమితమైన ఎనర్జీగా, ఉత్సాహంగా ఉంటారు. నేడు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ ఫ్రెండ్స్ కు హెల్ప్ చేస్తారు ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి. కానీ డబ్బు విషయంలోనే కలహాలు ఏర్పడవచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారు.

మిథున రాశి: ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ చివరకు లాభాలు చవిచూస్తారు. నేడు ఈ రాశివారు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ ఫ్యామిలీలో గొడవలు వస్తాయి. తీరిక లేని సమయాన్ని గడుపుతారు. ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు. కానీ అక్కడ కూడా తెలియని వారితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరుగుతుంది. భాగస్వామితో ఇతరుల వల్ల గొడవ పడుతారు.

కర్కాటక రాశి: కొత్త ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ ను వదిలేయండి. ఓటమి పాలవుతారు. కానీ వెంటనే విజయాలు మీ సొంతమవుతాయి. సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఈ రోజు ఎక్కువగా నడుస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మీ భాగస్వామితో రాత్రిపూట గొడవ పడుతారు.

సింహ రాశి: ఎనర్జీ చాలా ఉన్నప్పటికీ స్ట్రెస్ చిరాకు తెచ్చి పెడుతుంది. ఇతరులు ఇంకా చిరాకు పడేలా చేస్తారు. ఆర్థిక పరిస్థితుల నుంచి తొందరగా బయట పడేందుకు ప్రయత్నించండి. మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ చివర వరకు ధనాన్ని పొదుపు చేస్తారు. ఈ రాశివారు ఖర్చును తగ్గిస్తే మంచిది. అనవసరపు ఖర్చులు పెట్టవద్దు. ఇవాళ ఎక్కువగా సాంగ్స్ వింటారు. క్రియేటివ్ గా ఆలోచిస్తారు. ఇవాళ మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకుంటారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు. ఎక్కువగా ముస్తాబవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతారు.

కన్యా రాశి: మీ ఎనర్జీని తిరిగి పొందేందుకు రెస్ట్ అవసరం. కొన్ని కారణాల వల్ల ఒక్కసారిగా ఆర్థికంగా నష్టపోతారు. ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కూతూహాలాన్ని రేకెత్తించే మంచి విషయాలు చదవండి.చుట్టు పక్కల వారు గొడవలు పుట్టించే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అవేమీ పట్టించుకోకుండా ఉండడం మేలు. మీ శ్రీమతి తరపున బంధువులు కారణంగా గొడవలు జరుగుతాయి. నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయండి.మీ కంటే చిన్న వారితో ఇవాళ షాపింగ్ కు వెళ్తారు. మీ భాగస్వామితో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తారు.

తులా రాశి: నేడు కుటుంబీకులతో గడుపుతారు. దీంతో ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. సానుకూల దృక్పథంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు. కానీ ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకుంటారు. ఈ కారణంగామూడ్ మొత్తం ఆఫ్ అవుతుంది. నేడు ఈ రాశి వారు డబ్బు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెట్టాలో నేర్చుకుంటారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. బంధువులు రాకతో ఇల్లు కళకళలాడుతుంటుంది. మిమ్మల్ని ఇష్టపడేవారితో గడపుతారు.ఈ రాశివారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడడం మేలు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చిన్న చిన్న పార్టీలకు అటెంట్ అవుతుంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు మిమ్మిల్ని ఆకాశానికి ఎత్తేస్తారు.

వృశ్చిక రాశి: మీ ఆరోగ్యం వికసిస్తుంది. మీరు దీర్ఘకాల లాభాల కోస మ్యూచ్యువల్ ఫండ్ స్టాక్ లలో మదుపు చేయ్యాలి. మీరు ఎప్పటినుంచో కుడబెట్టిన ధనాన్ని మీ పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కష్టానికి తగ్గట్లుగా ఫలితం దక్కుతుంది. మీ పనులు భాగస్వామికి కోపం తెప్పిస్తాయి. ప్రేమలో నేడు మంచి విజయాలు అందుకుంటారు. కానీ ఆర్థికపరంగా మీ ఆలోచనలు ముందుకు సాగవు. మంచి నవలను కానీ, మ్యాగజైన్ కానీ చదువుతారు. సాయంత్రం వేళ స్నేహితులతో గడపండి. మీ భాగస్వామి నేడు మిమ్మల్ని పొగడటమే పనిగా పెట్టుకుంటాడు. ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు.

ధనుస్సు రాశి: మెంటల్‌గా, ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నించండి.కాగా యోగా ధ్యానం చేయండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి. మీరు ఊహించనివారి నుంచి డబ్బు అందుకుంటారు. ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం బెటర్. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్తారు. మీ భాగస్వామి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా హెల్ప్ చేస్తారు. కుటుంబ సభ్యులకు సహాయపడండి. ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు.మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు.

మకర రాశి: తల్లిదండ్రులకు మనీ విషయంలో హెల్ప్ చేస్తారు.ఆఫీసులో పలువురితో చిన్న చిన్న మనస్పర్థలు వస్తాయి. రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆలోచన చేస్తారు. విహార యాత్రలకు వెళ్తారు.కానీ అనారోగ్యంతో దీర్ఘకాలికంగా పోరాడుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువగా గడుపుతారు. బంధువుల కారణంగా చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. ఆర్థికంగా నష్టపోతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనకడుగు వేస్తారు. కాగా పెద్దల సలహాలు తీసుకోవడం మేలు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మీ భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చుపెడతారు.

కుంభ రాశి: కేలరీలు, పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం మేలు. కుటుంబం సమస్యల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. బంధువుల ఇంటికెళ్తారు. దీంతో రిలాక్స్ అవుతారు. నేడు మీ దగ్గరి వాళ్లను అన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా మెలగండి. మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు. ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో సినిమాకు రాత్రి సమయంలో ఎక్కువగా మాట్లాడుతుంటారు. హెల్త్ విషయంలో జాగ్రత్తపడాల్సి ఉంటుంది.

మీన రాశి: మీరు చేసిన ఏ పనులు అయినా సరే మీ చుట్టూ ఉన్నవారిని మెప్పిస్తాయి. ఇవాళ మీరు మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. మీ బాల్య దశను నెమరువేసుకుంటారు. ఫ్రెండ్స్ తో కలిసి పిక్‌నిక్ వెళ్తారు. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. మీ భాగస్వామితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. దీంతో మానసిక ప్రశాంతత పొందుతారు. మీరు గతంలో కొనుగోలు చేసిన స్థలాన్ని అమ్ముతారు. భాగస్వామితో హ్యాపీగా గడుపుతారు. బంధువుల మద్ధతు లభిస్తుంది. మీపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు.

Next Story