ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు

by Muthe.Rajitha |

ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల కొరతను నివారించే దిశగా సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల కొరతను నివారించే దిశగా సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సీనియర్ జ్యుడీషియల్ అధికారులను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసింది. ఈ జాబితాలో సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సి.హెచ్. పురుషోత్తమ్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కేడర్‌లో విశేష సేవలందిస్తున్న వీరి పేర్లను న్యాయమూర్తుల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్ర న్యాయశాఖ ఆమోదం అనంతరం రాష్ట్రపతి అనుమతితో వెంటనే వీరి నియామకానికి సంబంధించిన తుది నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ లీసా గిల్ నేతృత్వంలో కొనసాగుతున్న ఏపీ హైకోర్టులో, పెండింగ్‌లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించేందుకు ఈ కొత్త నియామకాలు ఎంతో తోడ్పడనున్నాయి.

Next Story