Golden Globes 2025 : గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కు నామినేట్ అయిన ఇండియన్ మూవీ ఇదే

by Muthe.Rajitha |   (  Updated:2024-12-09 16:49:38  IST  )

ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్(Gloden Globes Awards) కు మన దేశం నుంచి నామినేట్ అయిన సినిమా ఏంటో తెలుసా..?

Golden Globes 2025 : గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కు నామినేట్ అయిన ఇండియన్ మూవీ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్(Gloden Globes Awards) కు మన దేశం నుంచి నామినేట్ అయిన సినిమా ఏంటో తెలుసా..? ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకొని, విమర్శకులను సైతం మెప్పించిన "ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్" (All We Imagine as Light)అనే సినిమా. పాయల్ కపాడియా(Payal Kapadia) దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, మరాఠీ, మలయాళీ భాషల్లో విడుదలయ్యింది. ఇటీవలి 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌(Cannes Film Festival)లో ప్రదర్శించబడి గ్రాండ్ పిక్స్(Cannes Grand Pics) సొంతం చేసుకుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ ద్వారా 2024 యొక్క టాప్ 5 అంతర్జాతీయ చిత్రాలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా.. తాజాగా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ పోటీల్లో రెండు విభాగాల్లో నామినేట్ అయింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో నామినేట్ అయిన ఇండియన్ మూవీగా.. హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడుతన్నట్టు అవార్డ్స్ జ్యూరీ ప్రకటించింది.

Next Story