- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాను దోచుకుంటున్న వారికి ఇది భారీ వరం.. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ సంచలన పోస్ట్
టారిఫ్స్ విషయంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును డోనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. దీనివల్ల విదేశీ కంపెనీలకు అన్యాయంగా బిలియన్ల డాలర్లు అందుతాయని, ఈ కేసును మళ్ళీ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టారిప్స్ పై ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు (US Supreme Court) ఇచ్చిన తీర్పు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. సుప్రీం కోర్టు నిర్ణయం వల్ల అమెరికాను ఏళ్ల తరబడి దోచుకుంటున్న దేశాలు, కంపెనీలకు వందల బిలియన్ల డాలర్లు తిరిగి చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్పు ఆయా దేశాలకు, సంస్థలకు ఊహించని రీతిలో భారీ లాభాలను ("Windfall") చేకూరుస్తుందని, ప్రపంచం గతంలో ఎన్నడూ చూడని విధంగా వారు లబ్ధి పొందుతారని ఆయన పేర్కొన్నారు.
దశాబ్దాలుగా అమెరికాను వాడుకుంటున్న వారు ఇప్పుడు మరింత అధిక స్థాయిలో అదే పనిని కొనసాగించేలా ఈ తీర్పు ఉందని ట్రంప్ విమర్శించారు. అత్యున్నత న్యాయస్థానం ఇటువంటి పరిణామాలను ఉద్దేశపూర్వకంగా చేసి ఉండదని తాను నమ్ముతున్నట్లు తెలుపుతూనే, ఈ తీర్పు అత్యంత నిరాశపరిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో మళ్ళీ విచారణ జరిపే (Rehearing or Readjudication) అవకాశం ఉందా? అని ఆయన ప్రశ్నించారు.






