Today Panchangam: ఆదివారం తెలుగు పంచాంగం.. రాహుకాలం, దుర్ముహూర్తం, శుభ, అశుభ సమయాలు ఇవే!

by Jakkula.Mamatha |

ఈ రోజు(మే 24, 2026) ఆదివారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. తెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు.

Today Panchangam: ఆదివారం తెలుగు పంచాంగం.. రాహుకాలం, దుర్ముహూర్తం, శుభ, అశుభ సమయాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఏదైనా శుభకార్యం లేదా దూర ప్రయాణాలకు బయలుదేరే ముందు చాలా మంది ఇవాళ సమయం ఎలా ఉంది. నూతన పనులకు ఈరోజు మంచిదేనా? అసలు మంచి ముహుర్తం ఎప్పుడు ఉందని పంచాంగ నిపుణులను సంప్రదించడం లేదా క్యాలెండర్‌లో చూస్తుంటారు. పంచాంగ నిపుణుల ప్రకారం.. తెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. శుభ సమయం, వర్జ్యం, రాహుకాలం, దుర్ముహూర్తం, సూర్యోదయం, యమగండం వంటి వివరాలు కూడా చూడవచ్చు. ఈ రోజు తె. 05:45 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది. సాయంత్రం 06:40 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. ఈ క్రమంలో పలువురు పంచాంగ నిపుణుల ప్రకారం.. ఆదివారం నాటి శుభ అశుభ సమయాల గురించి తెలుసుకుందాం.

ఈరోజు శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:09 గంటల నుంచి ఉదయం 04:57 గంటల వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం: రా.8:14 నుంచి రా.9:53 వరకు ఉంటుంది.

అభిజిత్ ముహూర్తం సమయం : ఉ.11:47 నుండి మ.12:38 వరకు ఉంటుంది.

ఈ రోజు అశుభ సమయాలు

వర్జ్యం: ఉ.10:23 నుంచి మ.12:02 వరకు ఉంటుంది.

యమగండం సమయం: మ.12:13 నుండి మ.1:49 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం :సా.4:56 నుంచి సా.5:48 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : సా.05:3 నుంచి సా.6:40 వరకు ఉంటుంది.

గుళికాకాలం సమయం : మ.3:26 నుంచి సా.5:03 వరకు ఉంటుంది.

Next Story