గవర్నర్​ప్రసంగంలో పేద, రైతులు, కార్మికుల సమస్యల ప్రస్తావన లేదు: బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి

by Malleboina Mahesh |

గవర్నర్ ప్రసంగం అసత్యాలతో నిండి ఉంది! పేదలు, రైతులు, కార్మికుల సమస్యలను ప్రభుత్వం విస్మరించిందని మహేశ్వర్ రెడ్డి, కూనంనేని విమర్శలు.

గవర్నర్​ప్రసంగంలో పేద, రైతులు, కార్మికుల సమస్యల ప్రస్తావన లేదు: బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్​ప్రసంగంలో పేదలు, రైతులు, కార్మికులకు సంబంధించిన ఏ అంశం ప్రస్తావన లేదని, పూర్తిగా అసత్యాలతో ఉందని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి ఆరోపించారు. రేవంత్​ప్రభుత్వం అమలు చేయని పథకాలు అమలు చేసినట్లు, ఆరు గ్యారెంటీలు ఒకటి నెరవేర్చకుండా ఐదు అమలు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బుధవారం శాసనసభలో గవర్నర్​ప్రసంగంపై ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఆర్ధిక విద్వంసం జరుగుతున్న అప్పలు పెరిగిపోతున్న వాటిని ఏవిధంగా తగ్గించాలి, ఆదాయ వనరులు ఎక్కడ సృష్టించుకోవాలనే విషయాలు లేకపోవడం బాధకరమన్నారు. ముఖ్యమంత్రి విజన్​2047 కాదు ప్రస్తుతం 1947 మాదిరిగా తెలంగాణ పరిస్థితి ఉందన్నారు.

రియల్​ఎస్టేట్​పూర్తిగా పడిపోయిందని, దానిని ఏవిధంగా కోలుకోవాలనే ఆలోచించాల్సిన పాలకులు ట్రిబుట్​ఆర్​ట్యాక్స్​చెల్లింపులపై ఫోకస్​పెడతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న వారి ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా యమ పాశంలా తయారైందన్నారు. కౌలు రైతులు పరిస్ధితి దారుణంగా ఉందని, పత్తి, యూరియా కొనుగోలు చేసేందుకు కొత్తగా యాప్​లు తీసుకరావడంతో వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్​లో విద్యకు 8 శాతం నిధులు కేటాయిస్తున్నట్లు తెలిసిందని, గత పాలకులు 12 శాతం కేటాయింపులు చేసేవారని తెలిపారు. రాష్ట్రంలో 2245 బడుల్లో విద్యార్ధుల సంఖ్య జీరో ఉండటం దేనికి సంకేతమన్నారు.

భూమాత పోర్టల్​లో నిషేదిత భూముల సంఖ్య పెరుగుతుందని, దరణిలో పోర్టల్​64 లక్షల ఉంటే ఇప్పడు కోటి వరకు చేరిందని, దానిని పట్టాభూములుగా రైతులు మార్చుకునేందుకు అనేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అదే విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయం మరిచిపోయారని, మంత్రివర్గంలో కూడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని, ఉన్నవారికి సరైన పోర్టుపోలియోలు కూడా సక్రమంగా లేవన్నారు. వైద్య రంగంలో కుంటుపడిందని, ఆసుపత్రిలో వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది నియామకాలు లేకపోవడం పేదలు ప్రైవేటు ఆసుపత్రులు బాట పట్టే పరిస్థితి నెలకొందన్నారు. అదే విధంగా 317 జీవో కూడా సక్రమంగా అమలు చేయడం లేదని,దీంతో ఉద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు.

గవర్నర్​కేంద్రానికి, రాష్ట్రానికి సంధాన కర్తగా వ్యవహరించాలి: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

సభలో గవర్నర్ ప్రసంగం ప్రజలు ఆశించిన విధంగా లేదని, పేద, మధ్యతరగతి ప్రజలు కొత్త పథకాలు ప్రవేశపెడతారని భావిస్తే ఎలాంటి లేకపోవడం బాధకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, దక్షిణాది రాష్ట్రాలు చిన్న చూపు చూస్తుందని, గవర్నర్​కేంద్రంలో మాట్లాడిన తగిన నిధులు కేటాయించేలా చూడాలని కోరారు. రాష్ట్రం ఎప్పుడు లేని విధంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, వాటి నుంచి బయట పడేలా ఆయన చొరవ చూపాలన్నారు. తమ పార్టీ గవర్నర్​వ్యవస్థకు వ్యతిరేకమని, ఈ మధ్య కాలంలో గవర్నర్లు రాష్ట్రాల మధ్య వివాదాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ ప్రభుత్వం సింగరేణి, జెన్​కో, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, నిర్లక్ష్యం చేస్తే రాజకీయ పరమైన ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వానికి సూచించారు. ఫోర్త్ ​సీటి, హిల్ట్​ వంటి సక్రమంగా జరగక పోతే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు వస్తాయన్నారు. అవి ఆశించిన ముందుకు సాగేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేయాలన్నారు. వెలుగమట్ల సమస్యపై కొందరు కమ్యూనిస్టులు ఎక్కడ అంటూ విమర్శలు చేస్తున్నారని, పేదలకు సమస్యలు వస్తే తాము ఎంతో అవసరమో దేశమంతా గుర్తించిందన్నారు. కమ్యూనిస్టులు లేరని అనే వారికి ఇది చెంప పెట్టు లాంటిదన్నారు.

Next Story