గుడ్ న్యూస్ అనౌన్స్ చేసిన యంగ్ హీరోయిన్.. న్యూ బిగినింగ్ అంటూ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ బ్యూటీ కోమలి ప్రసాద్(Komalee Prasad ), రౌడీ బాయ్స్, సెకండ్ కేస్, హిట్- థర్డ్ కేస్, శశివదనే వంటి చితాల‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

గుడ్ న్యూస్ అనౌన్స్ చేసిన యంగ్ హీరోయిన్.. న్యూ బిగినింగ్ అంటూ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ కోమలి ప్రసాద్(Komalee Prasad), రౌడీ బాయ్స్, సెకండ్ కేస్, హిట్- థర్డ్ కేస్, శశివదనే వంటి చితాల‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుడ్ న్యూస్ అనౌన్స్ చేసింది. న్యూ బిగినింగ్ అనే క్యాప్షన్ జత చేసింది. కానీ చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను బ‌య‌ట‌కు చెప్పకుండా షాకిచ్చింది. కాగా.. ఈ సినిమా విషయానికొస్తే..‘మండవెట్టి’ చిత్రంతో త‌మిళంలో ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.ఇది ప‌వ‌ర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూప‌ర్ నేచుర‌ల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఆమె సినీ కెరీర్‌లో ఇదొక ముఖ్యమైన, కొత్త చాప్టర్‌ కావడంతో త‌న‌కు ప్రేక్షకుల ప్రేమ‌, ఆశీస్సులు కావాల‌ని కోరింది. అయితే ఈ చిత్రానికి ట‌స్కర్స్ డెన్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై శ‌ర‌ణ్ రాజ్ సెంథిల్‌కుమార్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు.

మండ‌వెట్టి మూవీ టీమ్‌ లాంఛ‌నంగా పూజా కార్యక్రమాల‌ను పూర్తి చేసి షూటింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. చిత్రంలోని న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు న‌ట‌కు ప్రాధాన్యమున్న ఈ క‌థ‌కు తెర‌పై జీవం పోయ‌టానికి శ్రమిస్తున్నారు. ‘మండ‌వెట్టి’తో కోమ‌లి ప్రసాద్ త‌న‌ సినీ కెరీర్‌లో కొత్త భాష‌, కొత్త సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. సూప‌ర్ నేచుర‌ల్ క్రైమ్ థ్రిల్లర్ అంశాల‌తో పాటు మిస్టిసిజం, ఎమోష‌న్స్ క‌ల‌యిక‌గా ఓ మ‌హిళ ప్రధానమైన క‌థ‌తో సినిమా తెర‌కెక్కుతోంది. మ‌న‌కు కావాల్సిన దాన్ని కోల్పోవ‌టం కలిగే బాధ‌, గుర్తింపు, జీవ‌న పోరాటం, వంటి అంశాలను మిళితం చేసి పెర్ఫామ‌న్స్‌కు స్కోప్ ఉన్న క‌థ‌ను రూపొందించారు.

పెర్ఫామెన్స్‌తో పాటు భావోద్వేగానికి ప్రాధాన్యమున్న ఈ క‌థలో కోమ‌లి ప్రసాద్ పాత్ర కీలకంగా ఉండనుందని టాక్. ‘వెల్ల కుదిర’వంటి సెన్సిబుల్‌, సైక‌లాజిక‌ల్ మూవీని రూపొందించి ప్రేక్షకుల‌తో పాటు విమ‌ర్శకుల ప్రశంస‌లు అందుకున్న డైరెక్టర్ శ‌ర‌ణ్‌రాజ్ సెంథిల్ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రొటీన్‌కు భిన్నంగా, భావోద్వేగాలు ప్రధానంగా మండ‌వెట్టి సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా విష‌యంలో ఆయ‌న ఎమోష‌న్స్‌, పాత్రల అంతర్గతభావాల‌పై పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మూవీలో అంశాలు కేవ‌లం ప్రేక్ష‌కులు చూడ‌టానికే కాదు..పాత్రల్లోని భావోద్వేగాలు ప్రతిబింబంగా మెప్పించ‌నున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇంకా తేన‌ప్పన్‌, గ‌జ‌రాజ్‌, అమృత స‌హాయ‌క పాత్రల్లో క‌నిపించ‌నున్నారు.

Next Story