- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న హిమ ప్రళయం.. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ!
అగ్రరాజ్యం అమెరికాలో భారీగా కురుస్తున్న మంచు తుఫాను (Winter Storm) తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మిడ్ వెస్ట్, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు తీర ప్రాంతాల్లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో భారీగా కురుస్తున్న మంచు తుఫాను (Winter Storm) తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మిడ్ వెస్ట్, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు తీర ప్రాంతాల్లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుపాను ధాటికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. రహదారులపై అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. న్యూయార్క్, న్యూజెర్సీ వంటి పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే 'స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ' (అత్యవసర పరిస్థితి) ప్రకటించాయి.
మంచుతో పాటు గంటకు 40 నుంచి 50 మైళ్ల వేగంతో వీస్తున్న చలిగాలులు పరిస్థితులను మరింత తీవ్రం చేస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు గడ్డకట్టే చలితో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. మంచును తొలగించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, నిరంతర హిమపాతం వల్ల ఆటంకాలు ఎదురవుతున్నాయి. అనేక చోట్ల విద్యుత్ లైన్లు దెబ్బతిని వేలాది ఇళ్లు చీకటిలో మగ్గుతున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.






