- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి గుంటల్లో నిశ్శబ్ద హంతకి.. కేరళను వణికిస్తున్న ‘నెగ్లేరియా ఫౌలెరీ’
కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కల్లోలం! నాలుగు నెలల్లోనే 17 మంది మృతి చెందడంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ముక్కు ద్వారా ప్రవేశించి మెదడును తినేసే ఈ ప్రాణాంతక అమీబా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక.

దిశ, వెబ్ డెస్క్: కేరళలో ప్రాణాంతకమైన 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' (నెగ్లేరియా ఫౌలెరీ) మరోసారి పంజా విసురుతోంది. గతంలో పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలను తీసిన ఈ హంతకీ.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో మరోసారి పంజా విసిరింది. గడిచిన 120 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 కేసులు నమోదు కాగా, ఈ వ్యాధి బారిన పడి 17 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సాధారణంగా సరస్సులు, నదులు వంటి స్వచ్ఛమైన నీటి వనరులలో నివసించే ఈ అమీబా, ప్రజలు ఆ నీటిలో మునిగినప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి నేరుగా మెదడుపై ప్రభావం చూపి ప్రాణాలను హరిస్తుంది.
ఈ వ్యాధి సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు కనిపించిన వెంటనే సరైన చికిత్స తీసుకోకపోతే మరణం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా బాధితులను త్వరగా గుర్తించి, వారికి తక్షణ చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతోంది.






