డిజిటల్ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్స్‌కు 'భద్రతా ముప్పు'!

by Dishafeatures2 |
డిజిటల్ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్స్‌కు భద్రతా ముప్పు!
X

దిశ, ఫీచర్స్ : సాంకేతికత పురోగతిలో భాగంగా భౌతికంగా మాత్రమే ఉనికిలో ఉన్న చాలా అంశాలు డిజిటలైజ్‌ చేయబడుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కారణంగా పాస్‌పోర్ట్స్ కూడా డిజిటిల్ ఫార్మాట్‌లోకి మారిపోయాయి. ఈ మేరకు వివిధ రకాల డిజిటల్ పాస్‌పోర్ట్ యాప్స్ అందుబాటులోకి రాగా.. సులభమైన ప్రయాణంతో పాటు టీకా సమాచారాన్ని ఒకే చోట నిల్వచేసేందుకు యూజ్ అవుతున్నాయి. అయితే వీటి వాడకం ఎక్కువ అవుతుండటంతో భద్రతా పరంగా కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం. 'ఐడెంటిటీ కార్డ్స్' మాదిరిగానే డిజిటల్ పాస్‌పోర్ట్స్ వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉండగా.. ప్రస్తుతం డిజిటల్ పాస్‌పోర్ట్ యాప్స్ విస్తృత వినియోగం హ్యాకర్స్‌కు లాభాన్ని చేకూరుస్తున్నాయి. ఒకే సోర్స్ నుంచి అధిక మొత్తంలో ప్రైవేట్ సమాచారం బయటకువెళ్తుందన్న విషయాన్ని పాస్‌పోర్ట్ వినియోగదారులు గుర్తించడం లేదు.


ఈ నేపథ్యంలోనే అమెరికన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సిమాంటెక్ నిర్వహించిన తాజా విశ్లేషణలో తాము పరిశీలించిన 40 డిజిటల్ పాస్‌పోర్ట్ యాప్స్‌ 27 ప్రధాన భద్రతా లోపాలను కలిగి ఉన్నాయని వెల్లడించింది. వీటిలో 40% ఎక్స్‌టర్నల్ డేటాబేస్‌లపై సమాచారాన్ని ఉంచగా, ఇవి ఎన్‌క్రిప్ట్ చేయబడవు కావున హ్యాక్ చేయడం సులభం. ఇక 35% కంటే ఎక్కువ యాప్స్ సురక్షిత HTTPS కనెక్షన్‌ని కూడా ఉపయోగించలేదు. ఆశ్చర్యకరంగా, వీటిలో 5% యాప్స్ డేటాను బదిలీ చేసేందుకు సురక్షిత చానెల్స్ కూడా ఉపయోగించలేదు. డిజిటల్ పాస్‌పోర్ట్ యాప్స్ అందించే QR కోడ్స్ ప్రభుత్వ అధికారులకు అవసరమైన మొత్తం సమాచారాన్ని త్వరగా, సమర్థవంతంగా పొందడంలో సాయపడతాయి. అయితే వినియోగదారులకు భద్రత కలిగించేందుకు మాత్రం మరింత వర్క్ చేయాల్సి ఉంది.



Next Story

Most Viewed