రొమాంటిక్ టచ్‌తో ‘మళ్లీ మళ్లీ’

by Mallepaka Hamsa |

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌(Chandrhas) హీరోగా వస్తున్న నూతన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’(Barabar Premistha).

రొమాంటిక్ టచ్‌తో ‘మళ్లీ మళ్లీ’
X

దిశ, సినిమా: యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌(Chandrhas) హీరోగా వస్తున్న నూతన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’(Barabar Premistha). సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ మహీ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా యూత్‌ను బాగా అట్రాక్ట్ చేశాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘మళ్లీ మళ్లీ’ పాటను రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జి విడుదల చేసిన ఈ రొమాంటిక్ మెలోడియస్‌ పాటలో చంద్రహాస్, మేఘన కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచింది. ఆర్ఆర్ ధ్రువన్ అందించిన సాహిత్యం, మహమ్మద్ ఇర్ఫాన్ గాత్రం ఎంతో వినసొంపుగా ఉన్నాయి. ఈ పాటను చూస్తే ఇట్టే ఆకట్టుకునే పాటగా కనిపిస్తోంది.

Next Story