- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూగజీవాలను శిక్షించడంలో ఉన్న ఆసక్తి మృగాల విషయంలో ఉండదు.. యంగ్ బ్యూటీ సంచలన పోస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అమానవీయ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

దిశ, సినిమా: దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అమానవీయ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆరేళ్ల పసిప్రాయం అని కూడా చూడకుండా ముగ్గురు మైనర్ బాలురు ఆ చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై పౌర సమాజం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ కల్పించాల్సిన చోటే చిన్నారులకు నరకం ఎదురవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ నటి భూమి ఫెడ్నెకర్ (Bhumi Pednekar)సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను వెల్లడిస్తూ.. నేరస్థులకు చట్టాలన్నా, సమాజమన్నా భయం లేకుండా పోతోందని మండిపడ్డారు.
పసి ప్రాణాలకు కనీస రక్షణ కల్పించడంలో మనం ఘోరంగా విఫలమవుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 10 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న బాలురు ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం మన విద్యా వ్యవస్థ, పెంపకం ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఫైర్ అయింది. ముఖ్యంగా దేశంలో వీధి కుక్కల సమస్యలపై గంటలు తరబడి చర్చలు జరుపుతున్న జనాలు.. అంతకంటూ క్రూరంగా ప్రవర్తించే మృగాల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించింది. అలాగే మూగజీవాలను శిక్షించడానికి చూపించే ఆసక్తి ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో ఎందుకు కనపించదు? అని అన్నది.
ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన చిన్నారిని నిర్భందించి, నోట్లో గుడ్డలు కుక్కి హింసించడం అత్యంత దారుణం అని విమర్శించింది. మన చుట్టూ జరుగుతున్న ఇటువంటి అఘాయిత్యాలను చూస్తుంటే సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తోందని ఆమె తన పోస్ట్‌లో పేర్కంది. ఢిల్లీలో జరిగిన ఈ ఘాతుకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. భూమి ఫెడ్నెకర్ చేసిన పోస్ట్ వైరల్ కావడంతో, నెటిజన్లు సైతం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం చట్టాలు ఉంటే సరిపోదని, నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించేలా శిక్షలు ఉండాలని బాధితురాలి కుటుంబానికి అండగా పోస్టులు పెడుతున్నారు.






