పాలు తాగిన పార్వతీ దేవి అమ్మవారి విగ్రహం

by Bhoopathi Nagaiah |

పార్వతీ దేవి పాలు తాగుతున్న ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. సిద్దిపేట పట్టణంలోని దాసంజనేయ ఆలయంలో శివ కుమార్ శర్మ

పాలు తాగిన పార్వతీ దేవి అమ్మవారి విగ్రహం
X

దిశ, సిద్దిపేట: పార్వతీ దేవి పాలు తాగుతున్న ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. సిద్దిపేట పట్టణంలోని దాసంజనేయ ఆలయంలో శివ కుమార్ శర్మ గత నాలుగు సంవత్సరాలుగా పూజలు చేస్తున్నాడు. గత రాత్రి ఆలయ పూజారికి అమ్మవారు కలలో ప్రత్యక్షమై రేపు ఉదయం తనకు పాలు పోయాల్సిందిగా కోరినట్లు ఆలయ అర్చకుడు తెలిపారు. దీంతో ఆ పూజారి అమ్మవారి కోరిక మేరకు ఉదయమే ఆలయానికి వచ్చి పాలు పోయాగా అమ్మవారు తాగినట్లు ఆ పూజారి తెలిపారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పట్టణ ప్రజలకు పాకింది. దీంతో అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని విగ్రహానికి పాలు తాపిస్తున్నారు. కొందరు పునకాలు వచ్చి శిగాలు ఊగుతున్నారు.

Next Story