'బంగారు బాతు' కాదు, ఇది బంగారు తాబేలు..! చూడండి!!

by Disha Web Desk 20 |
బంగారు బాతు కాదు, ఇది బంగారు తాబేలు..! చూడండి!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌కృతిలో ఎన్నో అందాలు, మ‌రెన్నో విచిత్రాలు. ఒక్కోటి ఒక్కో ప్ర‌త్యేక‌త‌ను చాటుతుంది. మ‌న‌కు తెలిసిన 'బంగారు బాతు' కథే, అలాగే ఇక్క‌డ బంగారు తాబేలు కూడా క‌థ‌లోలా విచిత్రంగా తోస్తుంది. చూడ‌టానికి బంగారు ఛాయ‌లో, తాబేలు ఆకారంలో ఉంటుంది. కానీ, తాబేలు కాదు! ఇక‌, ఇది 'చారిడోటెల్లా సెక్స్‌పంక్టాటా', గోల్డెన్ టార్టాయిస్ బీటిల్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది లీఫ్ బీటిల్ కుటుంబానికి చెందిన ఒక చిన్న శాకాహార కీట‌కం. ఈ కీటకానికి ఉన్న‌ అద్భుతమైన బంగారు ఛాయ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. అలాగే, గాజులా పారదర్శకంగా క‌నిపించే గోపురం క‌ప్పు దాన్ని మ‌రింత ప్ర‌త్యేకంగా చూపిస్తుంది. బంగారు తాబేలు బీటిల్ దాదాపు ఒకేలా క‌నిపిస్తాయి. ఈ కీట‌కం దాని బంగారు రంగును దాటి తదుపరి దశకు చేరుకోవ‌డమంటే అది దాని మ‌ర‌ణ‌మే. అందుకే దీని పేరుకు బంగారం క‌ల‌ప‌డం చాలా క‌రెక్ట్ కూడా. అమేజింగ్ నేచ‌ర్ అనే ప్ర‌సిద్ధ ప‌ర్యావ‌ర‌ణ ట్విట్ట‌ర్ ఖాతా పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెట్టింట్లో విశేష స్పంద‌న వ‌స్తుంది.


The Golden Tortoise. Awesome Nature pic.twitter.com/J3IQ8KXFLU

ఈ బంగారు తాబేలు బీటిల్ ఉత్తర అమెరికాకు చెందినది. తూర్పు యునైటెడ్ స్టేట్స్‌లో దాని అతిధేయ మొక్కలు ఉన్న చోట ఎక్కువగా కనిపిస్తుంది. ఈ జాతులు మొక్కల ఆకులు, చిలగడదుంపల ఆకులు, మార్నింగ్ గ్లోరీ వంటి తీగలపై ఉంటాయి.

Next Story

Most Viewed