- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘క్రేజీ కల్యాణం’ సినిమాలో స్టార్ నటుడు.. ఫస్ట్ లుక్ విడుదల
అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), తరుణ్ భాస్కర్(Tarun Bhaskar), కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కల్యాణం’(Crazy Kalyanam).

దిశ, సినిమా: అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), తరుణ్ భాస్కర్(Tarun Bhaskar), కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కల్యాణం’(Crazy Kalyanam). ఇందులో వీకే నరేష్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లోకనిపించనున్నారు. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈక్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు. వెర్సటైల్ యాక్టర్ వీకే నరేష్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో.. పర్వతాలు అనే పాత్రలో ట్రెడిషనల్‌గా వీకే నరేష్ ఆకట్టుకుంటున్నారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ‘క్రేజీ కల్యాణం’ సినిమా చిత్రీకరణ జరిపారు. సురేష్ బొబ్బిలి ‘క్రేజీ కల్యాణం’ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.






