కోతుల బెడద కోసం అదికొన్న యజమాని.. వాచ్ మెన్ కూతురు మృతి

by Dishanational2 |
కోతుల బెడద కోసం అదికొన్న యజమాని.. వాచ్ మెన్ కూతురు మృతి
X

దిశ, అమీన్ పూర్ : ఎయిర్ గన్ నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రమాదవశాత్తు ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి చెందిన ఘటన వివరాలను పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామ పరిధిలో ప్రసాద్ ఫామ్ హౌస్లో బుధవారం ఎయిర్ గన్ పేలి శాన్వి(4) మృతి చెందినట్లు గుర్తు చేశారు. ఈ ఫామ్ హౌస్‌లో నాగరాజు- సుకన్య దంపతులు మృతురాలు శాన్వి, 2 సంవత్సరాల అబ్బాయి‌తో కలిసి వాచ్ మెన్‌గా పని చేస్తూ అక్కడ నివాసముంటున్నారు. ఆ గ్రామంలో మల్లన్న జాతర ఉండడంతో ఫామ్ హౌస్‌లో పని చేస్తున్న వాచ్ మెన్ నాగరాజు ఇంటికి బంధువులు వచ్చారు. అందులో 17 సంవత్సరాల అబ్బాయి అక్కడ ఉన్న ఎయిర్ గన్‌తో ఆడుకుంటూ సెల్ఫీలు తీసుకుంటుండగా గన్ ప్రమాదవశాత్తు పేలింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న చిన్నారి శాన్వి కుడి కణత చిన్న పాటి బులెట్ తగలడంతో అక్కడే కుప్పకూలింది. తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రి‌కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

కోతుల బెడదఎక్కువ ఉండడంతో ఫామ్ హౌస్ యజమాని ప్రసాద్ 8 నెలల క్రితం ఆన్లైన్ ద్వారా 26వేలకు గన్‌ని కొనుగోలు చేశాడని, అందులోకి వాడే పిలెట్స్‌ని కోఠి లోని దుకాణంలో కొనుగోలు చేశారని, ఈ ఎయిర్ గన్‌లకు నిబంధనల ప్రకారం టెలీస్కోప్ వాడకూడదని, కానీ ఆ‌గన్ కి టెలీస్కోప్ సైతం బిగించారని తెలిపారు. అలాగే ఈ గన్ ద్వారా ప్రాణాపాయం తక్కువ అని దగ్గర నుండి పేల్చడంతోనే ఆ చిన్నారి మరణించిందని డీఎస్‌పీ వెల్లడించారు. ఎయిర్ గన్ ని ఎవ్వరు వాడరాదని అనుమతులు ఉండవని చెప్పారు. అనుమతులు లేకుండా ఎయిర్ గన్ ని కొనడంతో పాటు నిర్లక్ష్యంగా వదిలేసిన యజమానిపై కేసు నమోదు చేశామని, గన్‌ని పేల్చిన మైనర్ బాలుడి పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామని వెళ్లడించారు.



Next Story

Most Viewed