- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమాన టికెట్ రేట్లపై పరిమితులు ఎత్తివేసిన కేంద్రం!
దేశీయ విమాన టికెట్ ధరలపై పరిమితులను ఎత్తివేసిన కేంద్రం. రేపటి నుంచే కొత్త ధరలు అమలు. పండుగలు, రద్దీ సమయాల్లో ప్రయాణికులకు భారీగా పెరగనున్న ప్రయాణ భారంతో ఆందోళన.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం నేపథ్యంలో విమాన టికెట్ ధరలు (Air ticket prices) పెరుగుతాయని ఆందోళనలో ఉన్న ప్రయాణికులకు కేంద్రం నిర్ణయం (Central decision) షాక్ ఇచ్చింది. టికెట్ ధరలపై ఉన్న కనిష్ట, గరిష్ట పరిమితులను (Fare Caps) కేంద్ర పౌర విమానయాన శాఖ ఎత్తివేసింది. 2025 డిసెంబర్‌లో సామాన్యులకు భారం కాకూడదనే ఉద్దేశంతో విధించిన ఈ ధరల నియంత్రణను తొలగిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచే ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. విమాన ఇంధన ధరల పెరుగుదల, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా విమానయాన సంస్థలు చేసిన విన్నపాలకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, వీటికి ధరల నిర్ణయాధికారాన్ని పూర్తిగా అప్పగించింది.
అయితే ఈ నిర్ణయంతో పండుగలు, సెలవు దినాల్లో విమాన టికెట్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ పరిమితుల వల్ల ధరలు ఒక స్థాయి వరకే ఉండేవి, కానీ ఇకపై డిమాండ్‌ను బట్టి ఎయిర్‌లైన్స్ సంస్థలు తమకు నచ్చినట్లుగా ఛార్జీలను పెంచుకునే స్వేచ్ఛ లభించింది. ఈ క్రమంలో విమానయాన సంస్థలు ఇష్టానుసారంగా ధరలు పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెట్టవద్దని, పారదర్శక విధానాన్ని అనుసరించాలని కేంద్రం గట్టిగా హెచ్చరించింది. ఈ నిర్ణయం ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఊరటనిచ్చినప్పటికీ, మధ్యతరగతి ప్రయాణికులపై మాత్రం తీవ్ర ఆర్థిక భారాన్ని మోపనుంది.






