- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇప్పటివరకు వచ్చిన చిత్రాలలోకెల్లా అతిపెద్ద మల్టీ-స్టారర్.. ‘ధురంధర్’ సీక్వెల్‌పై ఆర్జీవీ పోస్ట్
బాలీవుడ్‌లో సంచలన విజయంగా నిలిచిన చిత్రం ‘ధురంధర్’(Dhurandhar).

దిశ, సినిమా: బాలీవుడ్‌లో సంచలన విజయంగా నిలిచిన చిత్రం ‘ధురంధర్’(Dhurandhar). రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధార్, లోకేష్ ధార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. రణ్‌వీర్ సరసన సారా అర్జున్ నటించి తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అలాగే సంజయ్ దత్, అక్షయ్ ఖరన్నా, ఆర్. మాధవన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో మెరిశారు. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ‘ధురంధర్’ ఆరు వారాలు దాటినప్పటికీ బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తోంది. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ భారీ విజయం నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
ఇక తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ‘ధురంధర్ 2’ సినిమా చరిత్రలోనే అతిపెద్ద మల్టీ-స్టారర్‌గా నిలవనుందని ఆయన హింట్ ఇచ్చారు. తొలి భాగంలో కనిపించిన ప్రతి పాత్ర ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిందని, పాత్ర పరిమాణం చిన్నదైనా ప్రభావం మాత్రం భారీగా ఉందని పేర్కొన్నారు. అప్పట్లో సహాయ పాత్రలుగా కనిపించినవే ఇప్పుడు దిగ్గజ సూపర్ స్టార్‌లుగా ఎదిగాయని, అందుకే ‘ధురంధర్ 2’ ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లోనే అతిపెద్ద మల్టీ-స్టారర్‌గా నిలవనుందని ఆయన స్పష్టం చేశారు.దీంతో ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది.






