- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే మామునూరు ఎయిర్ పోర్టు : రామ్మోహన్ నాయుడు
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించింది.

దిశ, వెబ్ డెస్క్ : పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రమచందర్ నాయక్, నాగరాజు, ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూమిని ప్రభుత్వం విమానయాన శాఖకు అప్పగించింది. తెలంగాణలో మొత్తం మూడు ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
2007లో ఎంఓయూ జరిగినప్పటికీ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మామునూరు ఎయిర్‌పోర్టు కల సాకారమైందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి మంత్రి పొంగులేటి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... వరంగల్‌ను రెండో రాజధానిగా సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ వల్లనే మామునూరు ఎయిర్‌పోర్టు కల నెరవేరుతోందని పేర్కొన్నారు.






