మౌనమే అంగీకారం.. కస్టమర్లతో మాట్లాడని ఉద్యోగి.. కంపెనీ ఏం చేసిందంటే..?

by Disha Web Desk 12 |
మౌనమే అంగీకారం.. కస్టమర్లతో మాట్లాడని ఉద్యోగి.. కంపెనీ ఏం చేసిందంటే..?
X

దిశ, ఫీచర్స్ : టెస్కో ఎంప్లాయి మూడు నెలలుగా కస్టమర్లతో మాట్లాడకుండానే పనిచేస్తున్నాడు. ఎప్పుడూ వాగుతూనే ఉండే లీ క్లార్క్.. కనీసం కొలిగ్స్‌తో కూడా మాట్లాడటం లేదని చెప్తున్నాడు. జనవరి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు ఈ మౌనవ్రతం కొనసాగనుండగా.. 'యూకే క్యాన్సర్ రీసెర్చ్, బ్రిటిష్ హార్ట్ ఫౌండేషనన్, డయాబెటీస్ యూకే' స్వచ్చంధ సంస్థలకు‌ ఫండ్ రేజ్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఆఫీస్‌లో ఉండగా తానేం చేస్తున్నానో తెలిపేందుకు బోర్డ్ మెడలో వేసుకుని తిరుగుతున్న ఈ 41 ఏళ్ల వ్యక్తి.. కస్టమర్స్‌తో కమ్యూనికేట్ అయ్యేందుకు పెన్, పేపర్ వాడుతుండటం విశేషం. ఇక తన పరిస్థితి అర్థం చేసుకున్న కస్టమర్స్ సైతం.. విరాళాలు అందిస్తుండటం విశేషం.

ఇక ఇంతకు ముందు కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న లీ క్లార్క్.. ఒకరికి హెల్ప్ చేయడంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నంత పీస్‌ఫుల్‌గా ఉంటుందని తెలిపాడు. ప్రజలు విరాళం అందించేందుకే తన దగ్గరకు రావడం చాలా ఆనందంగా ఉంటుందన్న ఆయన.. ఈ నిధుల సమీకరణ కోసం సమాజాన్ని ఏకం చేస్తుండడాన్ని అద్భుత అనుభవం గా పేర్కొన్నాడు. అంతేకాదు ఈ ఏడాది లండన్ మారథాన్ కంప్లీట్ చేయడంతో పాటు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలనే లక్ష్యంతో ఉన్నాడు.


Next Story

Most Viewed