- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: పరిశ్రమల పార్కుల అభివృద్ధికి టెండర్లు
రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల్లో మరిన్ని సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల్లో మరిన్ని సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఏఎల్ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పరిశ్రమల పార్కుల్లో వార్షిక నిర్వహణ, భద్రతా సేవలు, విద్యుత్ మౌలిక వనతుల పనుల కోసం మొత్తం 9 టెండర్లకు ఈ- ప్రొక్యూర్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ టెండర్లకు సంబంధించి బిడ్ డౌన్లోడ్ ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభమైంది. వచ్చేనెల 6 మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్లు నమర్పించాల్సి ఉంటుందని టీజీఐఐసీ చీఫ్ ఇంజినీర్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైటింగ్ ఇతరాలు..
జీడిమెట్ల, గాంధీనగర్, నాచారం, మౌలాలి, చర్లపల్లి, మల్లాపూర్, ఉప్పల్, బాలానగర్ వంటి హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లోని కీలక పారిశ్రామిక పార్కులు ఈ పనుల్లో భాగం కానున్నాయి. రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైటింగ్, విద్యుత్ సరఫరా, భద్రతా సేవలు వంటి మౌలిక వనతుల వార్షిక నిర్వహణ పనులు చేపట్టనున్నారు. మరోవైపు.. రహదారి విస్తరణకు అనుబంధంగా విద్యుత్ లైన్లు తరలించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యాచారం సెక్షన్లో రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లు, డీటీఆర్‌లు, ఎల్టీ లైన్లను రోడ్డు మధ్య నుంచి పక్కకు తరలించే కీలక పనులకు ప్రత్యేకంగా టెండర్ పిలిచారు. మేడ్చల్-సిద్దిపేట జోన్‌లోని మల్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో చేపట్టనున్న నిర్వహణ పనులను ఎస్సీ/ఎస్టీ కాంట్రాక్టర్లకు మాత్రమే కేటాయించడం ద్వారా సామాజిక నమానత్వానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ టెండర్ల అమలుతో పరిశ్రమల పార్కుల్లో మౌలిక వసతులు మెరుగుపడి, పరిశ్రమల కార్యకలాపాలు వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టబడులు ఆకర్షించడంతో పాటు, ఉపాధి అవకాశాలు పెరగడమే టీజీఐఐసీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
గాంధీనగర్ పార్క్‌కు రూ.2.48 కోట్లు..
హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల గాంధీనగర్ పారిశ్రామిక పార్క్ వార్షిక మెయింటెనెన్స్ పనులకుగానూ రూ.2.48 కోట్లు, మేడ్చల్ పరిధిలోని నాచారం పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకుగానూ రూ.1.15 కోట్లు, మేడ్చల్-సిద్దిపేట జోన్‌లోని మౌలాలి పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకుగానూ రూ.42.86 లక్షలు, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకుగానూ రూ.39.45కోట్లు, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలోని బాలానగర్ పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకుగానూ రూ.64.03 లక్షలు, హైదరాబాద్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకుగానూ రూ.1.09 కోట్లు, మేడ్చల్-సిద్దిపేట జోన్‌లో మల్లాపూర్ పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకుగానూ రూ.49.98 లక్షలు, మేడ్చల్ పరిధిలోని ఉప్పల్ పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకుగానూ రూ.1.21 కోట్లు, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్‌లోని మేడిపల్లిలో విద్యుత్ లైన్ తరలింపునకు రూ.2.20 కోట్లుగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు.






