హైదరాబాద్‌లో ఆగిన మెట్రోరైళ్లు!

by Muthe.Rajitha |   (  Updated:2026-03-20 06:13:20  IST  )

సాంకేతిక సమస్యలతో హైదరాబాద్ మెట్రోరైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్‌లో ఆగిన మెట్రోరైళ్లు!
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మెట్రోరైలు సర్వీసులు శుక్రవారం ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్రధానంగా నాగోల్‌-రాయదుర్గం మార్గంలో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడి, ఎక్కడికక్కడ పట్టాలపై నిలిచిపోయినట్టు సమాచారం. అయితే మెట్రోరైళ్లలో సాంకేతిక సమస్యలతోనే మెట్రో సర్వీసులు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు మెట్రోరైళ్లలోనే ఉండిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ౩౦ నిముషాల మరమ్మత్తుల అనంతరం తిరిగి యధావిధిగా సర్వీసులు ప్రారంభం అయ్యాయని హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రకటించింది.

Next Story