దూసుకెళ్లిన టాటా పవర్ షేర్స్

by Muthe.Rajitha |

మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల దేశీయ ఇంధన, విద్యుత్ అవసరాలు పెరుగుతాయనే అంచనాలతో టాటా పవర్ కంపెనీ షేర్లు దూసుకుపోతున్నాయి.

దూసుకెళ్లిన టాటా పవర్ షేర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : స్టాక్ మార్కెట్‌లో గురువారం టాటా పవర్ కంపెనీ లిమిటెడ్(Tata Power Company Ltd) షేర్లు దూసుకుపోయాయి. పశ్చిమాసియా యుద్ధం, గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీ ఉన్నప్పటికీ పవర్ సెక్టార్‌లోకి భారీగా పెట్టుబడులు వస్తుండటంతో టాటా పవర్ షేర్లు ఎగబాకాయి. షేరు విలువ సుమారు రూ. 400.30 గరిష్ట స్థాయిని తాకింది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే దాదాపు 1.11 కోట్ల షేర్లు చేతులు మారడంతో మొత్తం ట్రేడింగ్ విలువ సుమారు రూ. 436.18 కోట్లుగా నమోదైంది.

ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పవర్ సెక్టార్‌లో కనిపిస్తున్న సానుకూల పవనాలు. నేడు దేశీయ పవర్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ రంగం సగటున 3.16 శాతం లాభాల్లో ఉండగా, టాటా పవర్ మాత్రం ఇతర కంపెనీల కంటే దాదాపు 0.97 శాతం మెరుగైన ట్రేడింగ్ లో కొనసాగింది. మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా సెన్సెక్స్ నష్టాల్లో ఉన్నప్పటికీ, టాటా పవర్ నిలకడగా రాణించడం గమనార్హం. మార్చి 11న డెలివరీ వాల్యూమ్ 36 శాతానికి పైగా పెరిగి 36.57 లక్షల షేర్లుగా నమోదు కావడం చూస్తుంటే, కేవలం స్వల్పకాలిక ట్రేడర్లు మాత్రమే కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడిదారులు కూడా ఈ కంపెనీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

టాటా పవర్ స్కోరు 34 వద్ద ఉండటంతో దాని రేటింగ్‌ను 'Strong Sell' నుండి 'Sell' కి అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. ఇది కంపెనీ ఆర్థిక స్థితిగతుల్లో స్వల్ప మెరుగుదలను సూచిస్తున్నప్పటికీ, ఇంకా పూర్తిస్థాయిలో కొనుగోలు (Buy) సిగ్నల్ రాలేదని గమనించాలి. సుమారు రూ. 1,25,002 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన ఈ లార్జ్-క్యాప్ కంపెనీలో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగిందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Next Story