- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ లో మిన్నంటిన సంబరాలు
టీ20 మెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ న్యూజిలాండ్ పై గెలిచి.. విశ్వవిజేతగా నిలవడంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది.

దిశ, వెబ్ డెస్క్ : టీ20 మెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ సాధించిన సూపర్ విక్టరీ యావత్ దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. ఈ పోరులో కివీస్ జట్టును చిత్తు చేసి, భారత్ విశ్వవిజేతగా నిలవడంతో కోట్లాది మంది భారతీయుల నిరీక్షణకు తెరపడింది. మైదానంలో ఆటగాళ్లు ఒకరినొకరు హత్తుకుంటున్న దృశ్యాలు, గ్యాలరీల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్న తీరు ప్రతి క్రికెట్ అభిమాని గుండెను గర్వంతో నింపేసింది. ఈ విజయం కేవలం ఒక కప్పు గెలవడం మాత్రమే కాదు, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ ఆధిపత్యాన్ని మరోసారి చాటిచెప్పిన సందర్భం.
భారత్ విజయం ఖాయమైన వెంటనే దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఢిల్లీ నుండి గల్లీ దాకా జనం రోడ్లపైకి వచ్చి బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ డ్యాన్స్‌లు చేశారు. ప్రధాన నగరాలైన హైదరాబాద్, ముంబై, బెంగళూరులలో యువత అంతా భారత్ మాతా కీ జై అనే నినాదాలతో సంబరాలు చేసుకుంటున్నారు. భారత ఆటగాళ్ళు తొలుత బ్యాటింగ్ కు దిగి దూకుడు ప్రదర్శన చేయగా.. న్యూజిలాండ్ ముందు 256 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపారు. అయితే అనంతరం కివీస్ బ్యాటర్స్ అందరూ తడబడ్డారు. 100 పరుగుల లోపే 5 వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ జట్టుపై బాగా ఒత్తిడి పెరిగి 159 రన్స్ కే ఆల్ ఔట్ అయ్యింది.
ఈ అద్భుత విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధానమంత్రి నుండి సామాన్యుల వరకు అందరూ టీమ్ ఇండియాను అభినందనలతో ముంచెత్తుతున్నారు. న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్టును ఫైనల్‌లో ఓడించడం భారత్ యొక్క మానసిక ధైర్యానికి నిదర్శనం. ఈ గెలుపు స్ఫూర్తితో రాబోయే తరాల యువ క్రికెటర్లు మరింత ఉత్సాహంగా ముందుకు వస్తారని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పీఎం నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీనియర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కోహ్లీ జట్టును అభినందనల్లో ముంచెత్తారు.






