- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణకు మరో అంతర్జాతీయ మాల్ రాబోతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 'స్విస్ మాల్' అడుగు పెట్టనుంది. కాగా దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని వాడ్ కాంటన్ ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్డ్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో “స్విస్ మాల్” ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను క్రిస్టెల్ లూసియర్ ముందుంచగా.. సానుకూలంగా స్పందించారు. భారత్–స్విట్జర్లాండ్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం నేపథ్యంలో సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ రంగాల్లో, ముఖ్యంగా హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, క్రీడలకు సంబంధించిన రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు.
మహిళా సాధికారతపై చర్చిస్తూ.. తెలంగాణలో మహిళల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాలు (SHGs) మహిళలను ఆర్థికంగా, సామాజికంగా ఎలా బలపరుస్తున్నాయో సీఎం రేవంత్ రెడ్డి వారికి వివరించారు. వాడ్ ప్రతినిధులు తెలంగాణకు వచ్చి SHG మోడల్‌ను ప్రత్యక్షంగా అధ్యయనం చేయాలని సీఎం కోరగా.. త్వరలోనే ఓ ప్రతినిధుల బృందం రాష్ట్రానికి రానుందని సమాచారం. మరోవైపు పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృదం దావోస్ పర్యటన సాగుతోంది.






