Akshay Kumar: మరో రీమేక్‌కు టెంకాయ కొట్టిన అక్షయ్.. టైటిల్ చెప్పమంటూ పోస్ట్

by Manoj |   (  Updated:2023-03-30 17:07:10  IST  )

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మరో ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు..latest telugu news

Akshay Kumar: మరో రీమేక్‌కు టెంకాయ కొట్టిన అక్షయ్.. టైటిల్ చెప్పమంటూ పోస్ట్
X

Akshay Kumar

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మరో ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. కోలీవుడ్ హీరో సూర్య బ్లాక్ బస్టర్ మూవీ 'సూరారై పొట్రు'ను హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ రీమేక్ చిత్రంలో రాధికా మదన్‌ ఫిమేల్ లీడ్‌గా నటించనుండగా.. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి అక్షయ్ ఆమెతో కలిసొచ్చారు.

అనంతరం సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసిన అక్షయ్.. 'మంచి రోజున కొబ్బరికాయ కొట్టి, మనసులో చిన్న ప్రార్థనతో ఇంకా టైటిల్ ఖరారు చేయని మా సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తున్నాం. కలలు సాకారం చేసుకునే కాన్సెప్ట్‌తో తెరకెక్కే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఏవైనా సూచనలు ఉంటే షేర్ చేయండి' అంటూ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతోంది.

Next Story