- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"ఇది చాలా సీరియస్ మ్యాటర్".. మమతా ప్రభుత్వంపై ఈడీ ఆరోపణల వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఐపాక్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అడ్డుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఐపాక్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు (ED officials searches) నిర్వహిస్తున్న సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Bengal CM Mamata Banerjee) అడ్డుకున్న విషయం తెలిసిందే. అలాగే ఈడీ అధికారుల నుంచి కీలక ఫైల్లను మమత తీసుకెళ్లినట్లు అధికారులు ఆరోపించారు. ఈ క్రమంలో మమత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో దాదాపు రెండు రోజుల పాటు వాదనలను విన్న సుప్రీం కోర్టు (Supreme Court).. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలపై చేసింది. అంతకు ముందు మమత ప్రభుత్వంపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta) వాదనలు వినిపించారు. మా అధికారుల ఫోన్లు, కీలక డాక్యుమెంట్లను మమతా బెనర్జీతో పాటు పోలీసులు లాక్కున్నారు. మమతా బెనర్జీ ఐ-ప్యాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏంటి. బెంగాల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేశారు.
కోల్‌కతా హైకోర్టులో వాదించకుండా తమ లాయర్ ని అడ్డుకున్నారు. హైకోర్టులో తమ లాయర్ మైక్‌ను కట్ చేశారని ఎస్జీ తుషార్ మెహతా సుప్రీం కోర్టులో వాదించారు. అలాగే మమతా బెనర్జీ ఒక ప్రణాళిక ప్రకారం కథను నడిపిస్తున్నారు. కోల్‌కతా హైకోర్టుకు బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాలను తరలించారని ఆరోపించిన ఈడీ. కోల్‌కతా హైకోర్టును జంతర్‌మంతర్‌గా మార్చారా. ఇది చాలా సీరియస్ మ్యాటర్, దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ కేసు మొత్తాన్ని పూర్తిగా పరిశీలించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతకు ముందు బుధవారం టీఎంసీ, మమతా బెనర్జీ పిటీషన్లను సుప్రీం కోర్టు (Supreme Court) కొట్టి వేసిన విషయం తెలిసిందే.






