- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బతుకు పోరాటంలో నాన్నకు తోడుగా.. నెట్టింట్లో బుడ్డోడి క్యూట్ ఫొటోలు వైరల్
జన్మనిచ్చిన తల్లి చిటికెన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటే.. నాన్న భుజాల మీద కూర్చుని లోకాన్ని చూడటం నేర్చుకుంటాం.

దిశ, వెబ్‌డెస్క్: జన్మనిచ్చిన తల్లి చిటికెన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటే.. నాన్న భుజాల మీద కూర్చుని లోకాన్ని చూడటం నేర్చుకుంటాం. మన ఆకలి తీర్చడానికి తన ఆశలను, మన భవిష్యత్తు కోసం తన కష్టాన్ని దారబోసే నిశ్శబ్ద పోరాట యోధుడు నాన్న. బయటికి భీకరంగా కనిపించినా.. లోలోపల మాత్రం సముద్రమంత ప్రేమని దాచుకుని, కుటుంబం అనే నావను ఒడ్డుకు చేర్చే అలుపెరుగని సారథే నాన్న.
అది అలా ఉంచితే.. నేటి సమాజంలో పిల్లలు చేస్తు్న్న మారాం, కుటుంబ సభ్యులు చేస్తున్న గరాబంపై ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా నళిని ఉనగర్ అనే నెటిజన్ షేర్ చేసిన ఓ తండ్రీకొడుల ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘మీ జీవితం కష్టంగా ఉందని ఫిర్యాదు చేయడం మానేయండి. ఫొటోలో ఆ పిల్లవాడు తన తండ్రి కాళ్లు పట్టుకుని వీధిలో నిద్రపోతున్నాడు, తండ్రి రాత్రిపూట బొమ్మలు అమ్ముతూ తన బిడ్డ తినడానికి పని చేస్తున్నాడు. మనకు ఇళ్లు, ఆహారం, సకల సౌకర్యాలు అన్ని ఉన్నాయి. కానీ, అతను జీవితాన్ని గడుపుతున్నాడు’ అంటూ నళిని చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. ముఖ్యంగా పేదోడికి, ఉన్నోడికి మధ్య అంతరాన్ని స్పష్టంగా బయటపెట్టినట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.






